Thursday, April 25, 2024

‘అఖండ’ విజయం.. 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. బాలకృష్ణ – బోయపాటిల హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’.. డిసెంబర్ 2వ విడుదలై ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఇప్పటికీ కొన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో నడుస్తోంది. విడుదలైన తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోయింది. బాలకృష్ణ ‘అఘోర’గా పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది.

బాలయ్య కెరియర్లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా 103 థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుంది. అంతేకాదు 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోయింది. బాలయ్య యాక్షన్, బోయపాటి టేకింగ్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా ఇంతటి విజయం సాధించింది. కాగా, గతంలో బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో ‘సింహా’ .. ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. మూడో సారి అఖండతో హ్యాట్రిక్ సాధించారు. బాలకృష్ణ ‘అఘోర’గా చేయడం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement