Thursday, March 28, 2024

ఢిల్లీలో ఎయిర్ పొల్యూష‌న్‌.. బయటే కాదు, ఇంట్లోనూ డేంజ‌ర్ లెవ‌ల్స్‌..

వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు 9 ఏళ్ల ఆయుర్ధాయాన్ని కోల్పోనున్న‌ట్టు కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. అంత‌లా ఢిల్లీని చుట్టుముట్టిన ఎయిర్ పొల్యూష‌న్ చిన్నారుల‌ను, ఓల్డేజ్ వారిని ఊపిరి తీసుకోనీయ‌డం లేదు. బ‌య‌టి ప్ర‌దేశాల్లోనే కాకుండా ఇండ్ల‌లోనూ డేంజ‌ర్ లెవ‌ల్లో ఎయిర్ పొల్యూష‌న్ ఉంద‌ని చికాగో యూనివ‌ర్సిటీ నిర్వ‌హించి ఓ స్ట‌డీ వెల్ల‌డించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ఈ మ‌ధ్య‌కాలంలో తీవ్రస్థాయికి చేరింది. దీంతో స్కూళ్లు మూసివేయడంతో పాటు నిర్మాణాలు, కూల్చివేతలు, డీజిల్‌ జనరేటర్ల వినియోగంపై నిషేధించాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజా అధ్యయనంలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బయటి ప్ర‌దేశంలోనే కాకుండా ఇంటి లోపల కూడా కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరినట్లు తేలింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రకటించిన ప్రమాణాల కంటే ఢిల్లీలో ఇండ్లలో వాయుకాలుష్యం 20 రెట్లు ఎక్కువగా ఉందని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. పీఎం స్థాయి (వ్యాసంలో 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ కణాలు) ప్రభుత్వ మానిటరింగ్‌ సంస్థలు చెప్పిన వాటికంటే గణనీయంగా ఎక్కువగా ఉందని ఈ స్ట‌డీ ద్వారా వెల్ల‌డైంది. తక్కువ ఆదాయ గృహాల కంటే అధిక ఆదాయ గృహాలు 13 రెట్లు ఎక్కువ గాలి శుద్ధి చేసే అవకాశం ఉందని, అయితే ఇండోర్ వాయు కాలుష్యంపై దాని ప్రభావం కేవలం 10 శాతం మాత్రమేనని తేలింది. ఎయిర్ ప్యూరీఫైయర్లు ఉన్న ఇండ్ల‌ల్లో సాధారణంగా ఇండోర్ PM2.5 స్థాయిలో 8.6 శాతం తగ్గాయని ఈ స్ట‌డీలో తెలిసింది.

ఢిల్లీలో పేద, ధనిక తేడా లేకుండా ఎవరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేరని అధ్యయనం ప్రధాన రచయిత కెన్నెత్‌ లీ అన్నారు. ఇది ఎంతొ క్లిష్ట‌మైన సిచ్యుయేష‌న్. ఇండ్లలో ఉన్న కాలుష్యంపై దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం అవగాహన పెరగడం వల్లనే స్వచ్ఛమైన గాలి ల‌భించే చాన్స్ ఉందని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement