Saturday, June 3, 2023

బాల‌య్య షో లో మ‌హేశ్ బాబు .. ఫ్యాన్స్ కి పండ‌గే ..

బుల్లితెరపై త‌న హ‌వాని చాటుతున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌.. అన్ స్టాప‌బుల్ షోకి హోస్ట్ చేస్తున్నారు. ఫ‌స్ట్ గెస్ట్ గా మోహ‌న్ బాబుతో చేసిన ఫ‌స్ట్ ఎపిసోడ్, ఆ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నానితో చేసిన రెండో ఎపిసోడ్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో పాటు ఏకంగా మిలియ‌న్ల కొద్ది వ్యూస్ వ‌చ్చాయి.ఇక మూడో ఎపిసోడ్ బ్ర‌హ్మానందం, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి వ‌స్తార‌ని ప్రోమో కూడా రిలిజ్ చేశారు. కాగా టాలీవుడ్ లో ఇప్పుడో హాట్ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. క మ‌హేష్‌బాబు ఈ షోలో బాల‌య్య‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇది అఫీషియ‌ల్ న్యూస్. ఈ ఎపిసోడ్‌ను డిసెంబ‌ర్ 4న అన్న‌పూర్ణ స్టూడియోలో షూట్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ అదిరిపోయే ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వ‌స్తుందో చూడాలి. మ‌రోవైపు మ‌హేష్‌బాబు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడుకి గెస్ట్ గా వెళ్ళిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement