Sunday, February 5, 2023

ఎన్నిక‌ల త‌ర్వాత అంద‌రి లెక్క‌లు తేలుస్తా.. క‌మ‌ల్ నాథ్

మ‌రో ఎనిమిది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని గుర్తు చేశారు మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌ నాథ్‌.
ఎన్నికల తర్వాత అందరి లెక్కలు సరిచేస్తామంటూ పోలీసులను హెచ్చరించారు. బహిరంగ ర్యాలీలో మాట్లాడిన ఆయన ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దూకుడు, భయాందోళనలకు గురికావద్దని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. పోలీసు అధికారులంతా చెవులు విప్పి వినాలి. రాబోయే ఎన్నికల్లో అందరి ఖాతాలు సరిచేస్తాం’ అని కమల్‌నాథ్‌ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షాన పోలీసులు, అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండంపై ఆయన ఈ మేరకు హెచ్చరించారు.కాగా కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ మండిపడింది. బెదిరింపు, ప్రతీకారం, ప్రతీకార రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని బీజేపీ నేత షెహజాద్ పూనావల్ల విమర్శించారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆ పార్టీ రాష్ట్రంలో పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement