Tuesday, April 16, 2024

వందే భారత్​​ని వెంటాడుతున్న కష్టాలు.. మొన్న బర్రెలు, నిన్న ఆవు, ఇవ్వాల బేరింగ్​ ప్రాబ్లమ్​!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్​ మేడ్​ రైలు వందేభారత్​ ఎక్స్​ప్రెస్​. దీని ప్రారంభానికి ముందు నుంచే సమస్యలు వెంటాడుతున్నాయి. అంతకుముందు అల్లరిమూకలు రాళ్లదాడి చేయగా కొన్ని రోజులు రైలు నిలిచిపోయింది. ఇక.. మొన్న బర్రెలు ఢీకొట్టగా.. నిన్న ఆవు గుద్దుకుంది. ఇవ్వాల బేరింగ్​ ప్రాబ్లమ్ ఏర్పడి రైలు నిలిచిపోయింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వందే భారత్‌ ఎక్స్ ప్రెస్‌కు వరుసగా మూడోసారి శనివారం కూడా సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు వారణాసికి వెళ్లే ఈ రైలు రేక్‌లలో ఒకటి జామ్‌డ్ వీల్‌కు గురైంది. రైలు దంకౌర్, వైర్ స్టేషన్ల మధ్య C8 కోచ్ యొక్క ట్రాక్షన్ మోటారులో బేరింగ్ లోపం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

వారణాసి వందే భారత్ రేక్ (ట్రైన్ నెం. 22436) నార్త్ సెంట్రల్ రైల్వేలోని దంకౌర్, వైర్ స్టేషన్‌ల మధ్య ఉన్న C8 కోచ్‌లోని ట్రాక్షన్ మోటార్‌లో బేరింగ్ లోపం కారణంగా నిలిచిపోయింది.  గ్రౌండ్ స్టాఫ్ ఈ లోపాన్ని గుర్తించి, ఢిల్లీ నుండి వారణాసికి వెళ్తున్న రైలును ఆపేయాలని రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్‌ను అప్రమత్తం చేశారు.

తర్వాత, ఆన్‌బోర్డ్ సాంకేతిక సిబ్బంది తనిఖీ చేసిన తర్వాత ఎక్స్ ప్రెస్‌ను నియంత్రిత వేగంతో ఖుర్జా రైల్వే స్టేషన్‌కు 20 కి.మీ ముందుకు తీసుకెళ్లారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లోని ప్రయాణికులను స్టేషన్‌లో శతాబ్ది ఎక్స్ ప్రెస్‌కు తరలించారు. రేక్ నిర్వహణ కోసం డిపోకు తరలించి దీని వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించనున్నట్టు అధికారులు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement