Wednesday, March 27, 2024

ఆఫ్ఘ‌నిస్థాన్ వెళ్లేందుకు ఇండియా లారీల‌కు ప‌ర్మిష‌న్ ..మాన‌వ‌తాదృక్ప‌థం అంటోన్న పాక్ ప్ర‌ధాని..

ఆప్ఘ‌నిస్థాన్ ని తాలిబ‌న్లు చేజిక్కించుకున్న అనంత‌రం అక్క‌డి ప‌రిస్థితులు ద‌య‌నీయంగా, అతి దుర్భ‌రంగా మారాయి. ఆహారం కొర‌త ఏర్ప‌డ‌టంతో ఆఫ్గాన్ ప్ర‌జ‌లు ఆక‌లో ల‌క్ష్మ‌ణా అనే రితిగా అల‌మ‌టిస్తున్నారు. దాంతో ప‌లు దేశాలు ఆఫ్గాన్ ని ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇండియా కూడా 50వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ని వారికి అందించేందుకు సిద్ధ‌మ‌యింది. అయితే ఇవి ఆప్ఘనిస్థాన్ కు చేరాలంటే పాకిస్థాన్ మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి వెళ్లే వాహనాలకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మానవతా దృక్పథంతో అనుమతి ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్ల‌డించారు. దీంతో ఇండియా నుంచి 500 లారీలు ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement