Wednesday, April 24, 2024

Big Story: అదానీ ఆమ్‌దాని రోజుకు 1,612 కోట్లు.. ఏడాదిలో సంపద డబుల్‌

దేశంలో కుబేరుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోని 122 పట్టణాల్లో వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న వారు 1103 మంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ జాబితాలో కొత్తగా 149 మంది చేరారు. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన కైవల్య వోరా అందరి కంటే చిన్న వయస్సు ఉన్న కుబేరుడు. బెంగళూర్‌కు కేంద్రంగా కైవల్య కిరణా సరకులు డెలివరీ చేసే జిఎ్టోను స్థాపించారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హుర్న్‌ ఇండియా 2022 బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది.

వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న వారి సంఖ్య గత 5సంవత్సరాల్లో 62 శాతం పెరిగింది. వీరిలో 1990 తరువాత పుట్టిన కుబేరులు 13 మంది ఉన్నారు. అంతరత్జాతీయంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో అపకుబేరులు పెరుగుతున్నారు.
ఈ జాబితాలో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన సంపద జెట్‌ స్పీడ్‌తో పెరుగుతోంది. పది సంవత్సరాల క్రితం రిలయన్స్‌ అధి నేత ముఖేష్‌ అంబానీ సంపదలో అదానీది ఆరోవంతు మాత్రమే. ప్రస్తుతం ఆయన అంబానీ కంటే చాలా ముందుకు వెళ్లారు.

10.94 లక్షల కోట్లతో దేశంలో అగ్రస్థానంలో, ప్రపంచంలో 2వ స్థానంలోకి దూసుకుపోయారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022 ప్రకారం అదానీ రోజువారి సంపాదన 1612 కోట్లు. అదానీ సంపద ఒక సంవత్సరంలో 116 శాతం పెరిగింది. అంటే సంవత్సరంలో 5.89 లక్షల కోట్లు పెరిగింది. ఐదు సంవత్సరాల్లో ఆయన సంపద 1440 శాతం పెరిగింది. ప్రస్తుతం ముఖేష్‌ అంబానీ సంపద 7.94 లక్షల కోట్లుగా ఉంది. గత సంవత్సరం ముఖేష్‌ అంబానీ సంపద 11 శాతం పెరిగింది. ఐదు సంవత్సరాల్లో 115 శాతం పెరిగింది. అదానీ కంపెనీల మార్కెట్‌ విలువలో ఇటీవలనే టాటాలను మించిపోయారు.

కొవిడ్‌ వ్యాక్సిన్ల తయారు చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ ఎస్‌ పునావాలా సంపద కూడా భారీగా పెరిగింది. దీంతో ఈ జాబితాలో ఆయన ముఖేష్‌ అంబానీ తరువాత మూడో స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివనాడార్‌ 1,85,800 కోట్లు, డీమార్ట్‌ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్‌ దమానీ 1,75,100 కోట్లు, వినోద్‌ శాంతిలాల్‌ అదానీ 1,69,000 కోట్లు, ఎస్పీ హిందూజా 1,65,000 కో ట్లు, ఎల్‌ఎన్‌ మిత్తల్‌ 1,51,800 కోట్లు, దిలీప్‌ సంఘ్వీ 1,33,500, ఉదయ్‌ కోటక్‌ 1,19,400 కోట్లతో ఈ జాబితాలో టాప్‌ టెన్‌లో ఉన్నారు.

- Advertisement -

నైకా అధినేత్రి ఫాల్గుణి నాయర్‌, వేదాంత ఫ్యాషన్స్‌ అధినేత రవి మోదీ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. జెఎ్టో వ్యవస్థాపకుడు 19 సంవత్సరాల యువకుడు కైవల్య వోహ్రా 1000 కోట్ల సంపదతో ఈ జాబితాలో చోటు సంపదించుకున్నారు. వెయ్యి కోట్లకు పైగా సంపదతో ఈ జాబితాలో 1,103 మంది చోటు సాధించారు. ఐదు సంవత్సరాల క్రితంతో పోల్చితే వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న వారు 96 శాతం పెరిగారు. జాబితాలో ఉన్న వారిలో 82 శాతం మంది వయస్సులో 50 సంవత్సరాలకు పైబడిన వారు ఉన్నారు. కేవలం 0.6 శాతం మంది 30 సంవత్సరాల వయస్సు కంటే తక్కువగా ఉన్న వారు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement