Sunday, November 28, 2021

Tollywood Drug Case : ఈడీ ముందుకు చార్మి

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. బుధవారం హైదరాబాద్​లో ఈడీ ముందు సినీనటి చార్మి కౌర్ హాజరుకానున్నారు. ప్రధాన నింధితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో మొదటిరోజు డైరెక్టర్ పూరీ జగన్నాథ్​ విచారణను విచారించిన ఈడీ.. తదుపరి సినీ నటి చార్మిని విచారించనుంది.

సోమవారం పూరి జగన్నాథ్‌ను దాదాపు 10 గంటలపాటు విచారించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ వివరాలు, గత మూడేళ్ల లావాదేవీలు సేకరించారు. కెల్విన్ సహా మరో ఇద్దరు అనుచరుల ఫోన్లలో గతంలో లభించిన సినీ తారల వివరాల ఆధారంగానే నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

మరోవైపు హవాలా మార్గంలో విదేశాలకు డబ్బును తరలించి, అక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది నిజమైతే… మనీలాండరింగ్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. విదేశాలకు ఎలా నిధులను తరలించారనే విషయమై ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ నెల 6న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, 8న హీరో రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.

కాగా, నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్‌ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్‌ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ‘ఫెమా’ కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది.  హవాలా మార్గంలో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఈడీ.. కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News