Thursday, September 23, 2021

ఏపీ సీఎంకి హ్యాట్సాఫ్‌.. జగన్ ను ఫాలో అవ్వండిః స్టాలిన్ కు విశాల్ సూచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హీరో విశాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్‌కి హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు. సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి దీనికి సంబంధించి ఓ జీవోను కూడా విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హీరో విశాల్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై  ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమిళనాడులో కూడా అమలు చేయాలని ఆరాష్ట్ర సీఎంను ఆయన కోరారు.

 ‘ఏపీలోని థియేటర్లలో ఆన్‌లైన్ బుకింగ్‌ విధానాన్ని తీసుకొస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి హ్యాట్సాఫ్. మేము ఇలాంటి విధానాన్నే త‌మిళ‌నాడులో పెడితే బావుంటుంద‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాం. ఇలాంటి విష‌యం జ‌ర‌గడం చాలా ఆనందం. సినీ ప‌రిశ్ర‌మలోని ప్రతి ఒక్కరు దీనిని స్వాగతించాలి. ఇలా చేస్తే వంద‌శాతం పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. గౌర‌వ‌నీయులైన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ గారు ఇలాంటి ప‌ద్ధ‌తిని త‌మిళ‌నాడులో తీసుకురావాలని కోరుతున్నాను. అలా చేస్తే థియేట‌ర్స్ క‌లెక్ష‌న్స్ విష‌యంలో పార‌దర్శ‌క‌త క‌నిపిస్తుంది. సినీ ఇండ‌స్ట్రీకి, ప్ర‌భుత్వానికి ఇదొక వ‌రం’అని విశాల్  తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఏపీలో రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలోనే సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. సినిమా టికెట్ల విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకే కొత్త పోర్టల్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీస్ నడుస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఇది కూడా చదవండిః 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలిః కేంద్రానికి స్థాయీ సంఘం సిఫార్సు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News