Thursday, September 16, 2021

సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్.. మెగా అభిమానుల్లో టెన్షన్!

బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగా అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. నిన్న రాత్రి నుండి అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే అపోలో వైద్యులు రెండు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తాజా బులిటెన్ ప్రకారం.. సాయి ధరమ్ తేజ్ కు సిటీ స్కాన్ తో పాటు పలు టెస్ట్ లు పూర్తి చేసినట్లు తెలిపారు. షోల్డర్ బొన్ విరిగినట్టు ప్రకటించారు. ఇప్పటికీ ఇన్ సైడ్ బ్లీడింగ్,ఆర్గాన్ డామేజ్ లేదని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, 48 గంటలు అబ్జర్వేషన్ లో సాయి ధరమ్ తేజ్ ను ఉంచారు. దీంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం ఆస్పత్రికి హీరో రామ్ చరణ్ వచ్చారు. సాయి ఆరోగ్యంపై ఆరా తీశారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నాడని, అభిమానులెవ్వరూ ఆందోళన చెందవద్దని చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ వెల్లడించారు. భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటాడని తెలిపారు.

మరోవైపు సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ కోసం అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా ట్వీట్ వేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారని, ఎలాంటి చింత పెట్టుకోకండి అని తెలిపారు. మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారని బండ్ల గణేష్ చెప్పారు.

సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్.. మెగా అభిమానుల్లో టెన్షన్!
సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్.. మెగా అభిమానుల్లో టెన్షన్!
Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News