Saturday, April 20, 2024

NTR movie: ఎన్టీఆర్ మూవీలో స్టార్ హీరో.. క్యారెక్టర్ ఏంటో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘RRR’మూవీ వాయిదా పడడంతో తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. మొన్నటి వరకు RRR సినిమా ప్రమోషన్ తో బిజీగా ఉన్న తారక్.. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో కొత్త సినిమా రానుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ కొరటాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ రెండో సినిమా ఇది. గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన జ‌న‌తాగ్యారేజ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అంతేకాదు ఎన్టీఆర్ సినీ కేరీర్ లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. తాజాగా మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయనున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కినేని సుధాకర్ తో కలిసి హీరో నందమూరి కల్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.

అయితే ప్ర‌స్తుతం ఈ సినిమా గురించి ఆస‌క్తికర అప్ డేట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ గా యాంగీ హీరో రాజశేఖర్ కనిపించనున్నారట. జనతాగ్యారేజ్ లో మోహన్ లాల్ పాత్ర ఉన్నట్లే ఈ సినిమాలోనూ ఒక కీలక పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజశేఖర్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గానే వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా అయిపోయాయని, రాజశేఖర్ సైతం పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శి.. ఏప్రిల్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement