టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది లయ. స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఈ బ్యూటీ ప్రస్తుతం కాలిఫోర్నియాలో తన ఫ్యామిలీతో కలిసి సెటిలైంది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆ లోటును తీరుస్తుంది లయ. ఎప్పటికపుడు ట్రెండీ పాటలతో నెట్టింట సందడి చేస్తుంటుంది. తాజాగా సర్కారు వారి పాట నుంచి Every Penny songకు స్టైలిష్ స్టెప్పులేసి అదరహో అనిపించింది. గతంలో తన ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లయ..ఈ సారి కూతురితో కలిసి డ్యాన్స్ చేసింది. కర్లీ హెయిర్‌లో ఉన్న లయ, శ్లోక బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ లో స్లైలిష్ గా స్టెప్పులేసి..సితారను బీట్ చేశారు. తళ్లీకూతుళ్లు పెన్నీ పాటను రీక్రియేట్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
కూతురితో-ఫ్రెండ్ తో లయ డ్యాన్స్

Previous articleబీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలి : అమిత్ షా
Next articleఆరోగ్య ప్రదాత.. శ్రీ ధన్వంతరి శ్లోకం (ఆడియోతో..)
Advertisement
తాజా వార్తలు
Advertisement