Thursday, April 25, 2024

న్యూ ఇయ‌ర్ కి ‘ఆచార్య’ నుండి అప్ డేట్

కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రం నుండి న్యూ ఇయ‌ర్ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని బిగ్ అప్ డేట్ ని రిలీజ్ చేయ‌నున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రం నుండి ట్రైల‌ర్ లేదా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ల‌పై చిత్రీక‌రించిన పాట‌ను గాని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా పూజ హెగ్డే కనిపించనున్నారు. ‘సిద్ధ’ అనే పవర్ఫుల్ పాత్రలో చరణ్ కనిపించనుండగా, ‘నీలాంబరి’ అనే గ్రామీణ యువతి పాత్రలో .. లంగా ఓణీలో పూజ హెగ్డే కనువిందు చేయనుంది. ఇటు చిరంజీవి నుంచి వదిలిన ‘లాహే లాహే’ సాంగ్, అటు చరణ్ – పూజ హెగ్డే కాంబినేషన్లో వదిలిన ‘నీలాంబరి’ సాంగ్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయాయి. మణిశర్మ ట్యూన్స్ కి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement