Friday, April 26, 2024

Acharya: సిద్ధ‌గా అదిరిన రామ్ చ‌ర‌ణ్ ..న‌వంబ‌ర్ 28న టీజ‌ర్..

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన‌పాత్ర‌ని పోషిస్తున్నారు. చిరూకి జంట‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. కాగా ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో మెర‌వ‌నున్నాడు. ఆయ‌న‌కి జోడీగా పూజాహెగ్డే న‌టిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సిద్ధా గా నటిస్తున్న రామ్‌ చరణ్‌ టీజర్‌ ను నవంబర్‌ 28 న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement