Tuesday, March 26, 2024

అవినీతిప‌రులు కావాలా – నిజాయితీప‌రుడు కావాలా ‘కేజ్రీవాల్’ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఐదు రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా ప‌లు రాజ‌కీయ పార్టీల‌నీ త‌మ పార్టీనే గెలిపించే దిశ‌గా వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఈ మేర‌కు పంజాబ్ లో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ య‌త్నిస్తోంది. కాగా ఇప్ప‌టికే సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది ఆమ్ ఆద్మీ. ఈ మేర‌కు ఆప్ అధినేత, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజివాల్ పంజాబ్‌లో మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఫిల్లౌర్ లో ఎన్నికల ప్రచారాన్ని చేప‌ట్టారు. ఒక‌వైపు అవినీతి ప‌రులు .. మ‌రోవైపు నిజాయితీప‌రుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కాంగ్రెస్ , బీజేపీలపై అరవింద్ కేజ్రివాల్ విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ నేతలు అవినీతిలో కూరుకుపోయారన్నారు. వారి పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒకవైపు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పపడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న‌వారు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నావారు ఉన్నారు. మరో వైపు ఎప్పుడూ ఎవరి నుంచి ఒక 25 పైసలు కూడా తీసుకోని వ్యక్తి పోటీలో ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్‌కు నిజాయితీగల సీఎం అవ‌స‌రమని కేజ్రివాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నిజాయితీపరుడని ఈసందర్భంగా తెలిపారు. ప్రజలు ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement