Saturday, April 20, 2024

ఇది సామాన్యుల విజ‌యం – కేజ్రీవాల్‌ , మ‌నీష్ సుసోడియా

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ భారీ ఆధిక్యంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే మ్యాజిక్ ఫిగ‌ర్ దాటూతూ.. ఏకంగా 100 స్థానాల అధిక్యం దిశ‌గా ముందుకు సాగుతోంది. దీంతో మ‌రో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం ఏర్పాటుకు సంకేతాలు పంపింది. ఈ క్రమంలోనే ఆప్ నాయ‌కుడు, ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సుసోడియా మాట్లాడుతూ… పంజాబ్ లో ఆమ్ ఆద్మీ (ఆప్‌) సాధించిన గెలుపు.. సామాన్యుల గెలుపు అని అన్నారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ పాల‌నా విధానం నేడు జాతీయ స్థాయికి వెళ్తున్న‌ద‌న్నారు. పంజాబ్‌ ఎన్నికల ఫలితాలు అరవింద్‌ కేజ్రీవాల్‌కు, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పాలనా విధానాలకు ఆమోదం తెలిపాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తెలిపారు. మేం కేజ్రీవాల్ మోడల్ పాలనను మాకు కారకంగా చేస్తున్నాము.

బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ జీలు కలలు కన్న భారతదేశం కోసం వారి దార్శనికతపై ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే మంచి ఉద్దేశ్యంతో నిజాయితీగల ప్రభుత్వం న‌డుపుతున్నాం. మేం ప్రాథమిక సౌకర్యాలు, పాఠశాలలు, వైద్యం, ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నాము. మేము ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నాము. ప్రజలు ఆలోచన క‌నెక్టు అయి ముందుకు సాగుతూ.. మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని వివ‌రించారు. ఇది (ఆప్ పాల‌నా విధానం) ఢిల్లీలో మెరుగైన ఫ‌లితాలు అందించింది. ఇప్పుడు పంజాబ్‌లో కూడా పని చేస్తోంది. ఇది మా ‘కేజ్రీవాల్ పాలనా నమూనా’తో మరింత జాతీయ పాత్రను పోషిస్తుందని చూస్తుంది. ఢిల్లీ .. పంజాబ్‌లలో మేం చేసే పనిని గమనించండి. భారతదేశ ప్రజలు ఇప్పుడు మాతో.. ఆప్ తో ఉన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కాదు.. ‘ ఆమ్ ఆద్మీ ‘ (సామాన్యుడు) విజయం” అని సిసోడియా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement