Friday, January 21, 2022

Omicron: మహారాష్ట్రలో వెయ్యి దాటిన ఒమిక్రాన్ బాధితులు.. దేశవ్యాప్తంగా ఎన్ని కేసులంటే..

భారతదేశంలో కరోనా కేసులు ఓవైపు.. ఒమిక్రాన్ కేసులు మరోవైపు విజృంభిస్తున్నాయి. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాప్తించింది. కేంద్రం వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623కి చేరింది. ఒమిక్రాన్ బాధితుల్లో 1409 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ అత్యధికంగా మహారాష్ట్రలో 1009, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్తాన్‌లో 373 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 333, తమిళనాడులో 185, హర్యానా 125, తెలంగాణలో 123 కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో 47 మంది బాధితులు కోలుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News