Monday, May 29, 2023

రోడ్డుప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ మృతి

కరీంనగర్ శివార్లలో మానేరు స్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్యూటీలో భాగంగా స్కూటీపై వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ మృతిచెందారు. కరీంనగర్ లోని అలుకాపురి కాలనీకి చెందిన రజిత రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ మ్యాథ్స్ పీజీ టీచర్ గా పనిచేస్తున్నారు. ఈరోజు ఉదయం తన వాహనంపై వెళ్తుండగా కాంక్రీట్ మిక్సర్ ట్రాన్స్ పోర్టు చేసే ట్యాంకర్ స్కూటీ మీదుగా వెల్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. రోజు స్కూటీపై మానేరు స్కూల్ వరకు వచ్చి అక్కడ వాహనం పార్కింగ్ చేసి బస్సులో వెళ్లే రజిత మరో 20 నుండి 30 మీటర్ల దూరం చేరుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement