Saturday, April 20, 2024

Braking: హ‌ర్యానా డిప్యూటీ సీఎంకు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

హర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్‌ చౌతాలాకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌతాలా కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో దుశ్యంత్‌ చౌతాలాకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రమాదానికి గురైన వాహనంలోని ఒక కమెండోకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. దుశ్యంత్ చౌతాలా సిర్సా నుంచి హిస్సార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపంచకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement