Thursday, April 18, 2024

ఉచితాలు.. లంచాలు ఒకటే.! కేంద్రం, ఈసీపై సుప్రీం సీరియస్‌..

ఎన్నికల ప్రచారంలో ప్రకటించే ఉచితాలపై కీలక పిటిషన్‌ సుప్రీం కోర్టులో దాఖలైంది. రాజకీయ పార్టీలు ఇష్టారీతిన వరాలు ప్రకటిస్తున్నాయని, ప్రజా ధనంతో వాటిని అందిస్తామని ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని, అలా చేయడం లంచం ఇస్తామని ప్రకటించడానికి సరిపోలినదేనని పిటిషన్‌ చెప్పుకొచ్చారు. ప్రలోభ పెట్టడానికి ఏ మాత్రం తక్కువ కాదని, ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అందుకే వీటిని నిరోధించేలా ఎన్నికల సంఘానికి సూచనలు చేయాలని బీజేపీ నేత అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృతంలోని జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణకు సిద్ధమైంది. ఇలాంటి ప్రకటనలు చేసిన పార్టీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పిటిషన్‌ విచారిస్తూ.. సీజేఐ ఎన్‌వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుతానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

ఉచితాలు, తాయిలాలు ప్రకటిస్తూ.. ఓట్లకు గాలం వేయడం.. తీవ్రమైన అంశమని సీజేఐ ఎన్‌వీ రమణ మండిపడ్డారు. ఉచిత వాగ్ధానాల బడ్జెట్‌.. రెగ్యులర్‌ బడ్జెట్‌ను దాటి పోతుందన్నారు. ఇది అవినీతి కాకపోయినా.. పోటీలో తారతమ్యాలను సృష్టిస్తుందని తెలిపారు. పంజాబ్‌ అసెంబ్లిd ఎన్నికల అంశాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళకు రూ.1000 ఇస్తామని ఆప్‌ ప్రకటించింది. రూ.2000 ఇస్తామని శిరోమణి అకాలీ దళ్‌ ప్రకటించింది. ప్రతీ మహిళకు రూ.2వేలతో పాటు ఏడాదికి 8 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కాలేజీకి వెళ్లే యువతికి స్కూటీ, 12వ తరగతి పాస్‌ అయితే రూ.20వేలు, 10 పాస్‌ అయితే.. రూ.15వేలు.. ఇలాంటి అంశాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. డబ్బు వాగ్ధానాలు, ఉచితాల ప్రకటనలు ఆందోళనకర స్థాయికి పెరిగాయని పిటిషనర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement