Friday, April 19, 2024

సినిమా టికెట్‌ ధరల వివాదానికి తెర.. నేడు ప్రభుత్వానికి నివేదిక!

ఏపీలో వివాదాస్పదంగా మారిన సినిమా టికెట్ల ధరల అంశానికి నేటితో తెర పెడే అవకాశం ఉంది. సచివాలయంలో ఈ రోజు సినిమా టికెట్ల ధరల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే టికెట్ల ధరల ప్రభుత్వం సినీ ప్రముఖలు అభిప్రాయాలను తీసుకుంది. ఈ రోజు సినిమా టికెట్ల ధరల కమిటీ తమ తుది నివేదికను ప్రభుత్వానికి అందించునుంది.

కాగా, ఇటీవల సినీ హీరోలు, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను వారు చర్చించారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు.

గత కొంత కాలంగా సినిమా టిక్కెట్ ధరలపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టిక్కెట్ ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ టాలీవుడ్‌లోని కొందరు కోరుతున్నారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నేడు సమావేశం కానున్న ఆ కమిటి.. సినిమా టిక్కెట్ ధరలపై నిర్ణయం తీసుకోనున్నారు. 

ఇదిలా ఉంటే.. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ ధర పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. ఈ నెల 25న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ కు తొలి ప్రయోజనం దక్కనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement