దేశ రాజధాని అయిన ఢిల్లీలో నడిరోడ్డుపై 16ఏళ్ల యువతి దారుణహత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ప్రియుడు సాహిల్ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. యువతి, సాహిల్ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని స్థానికులు పేర్కొంటున్నారు. బర్త్ డే పార్టీకి వెళ్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సాహిల్ యువతిని 40సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యంతో ఈ దారుణ ఘటన జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.
- Advertisement -