Friday, March 29, 2024

తెలంగాణ‌ విజ‌న్ 2041 – 91 మాస్ట‌ర్ ప్లాన్ లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతా రంగాలను గుర్తించి, ఆ ప్రకారమే ప్రతిపాదనలు పంపిస్తూ, నిధులను రాబట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయంగా విభేదాలున్నప్పటికీ అభివృద్ధివైపు దూసుకెళ్తూ లక్ష్యాలను చేరుకుంటున్న సందర్భాలను ఉంటంకిస్తూ ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూనే ఉన్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా 50 లక్షల జనాభా దాటిన మెట్రోపాలిటన్‌ నగరాలను ఎంపికచేసి అభి వృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఆ జాబి తాలో రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. రానున్న రెండు దశాబ్ధాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన నగరాలు, పట్టణాలకు వేర్వేరుగా ”మాస్టర్‌ ప్లాన్‌” లను సిద్దం చేసింది.

రాష్ట్రంలో మొత్తం 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 128 ప్రధాన పట్టణా లు ఉన్నాయి. అందులోంచి ప్రధాన పట్టణాలు, నగరాలను ఎంపి కచేసి మొత్తం 91 మాస్టర్‌ ప్లాన్‌లకు సంబంధించిన నివేదికలను ఇప్ప టికే కేంద్ర ఆర్థికశాఖకు, పట్టణాభివృద్ధిశాఖకు పంపించారు. గడిచిన రెండు నెలల కాలంగా సంబంధిత అధికారులు పలుమార్లు ఢిల్లిd వెళ్ళి నిధులకోసం ప్రయత్నాలు చేశారు. అలాగే పారిశ్రామిక, ఐటీ రంగా లకు సంబంధించిన నివేదికలను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమ ర్పించారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రి, కేంద్రం లోని పలు కీలక శాఖలకు లేఖలు రాయగా, తాజాగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్ట నున్న కేంద్ర బడ్జెట్‌లో ఏ మేరకు ప్రాధాన్యత ఉంటుందోనని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే పట్టణీకరణ అభి వృద్ధిని చూపుతూ పదేపదే నిధుల కోసం విజ్ఞాపనలు పంపుతున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్ర ంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహ కరించాలని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటు- అందించేందుకు వచ్చే బడ్జెట్లోనైనా సరిపోయే అన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.

ప్రత్యేక నిధులు లేకున్నా… ప్రగతి పథం
హైదరాబాద్‌, వరంగల్‌, ఇతర పురపాలికల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇస్తారని, లేదంటే హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అయినా కేటాయిస్తారని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. గడిచిన రెండేళ్ళుగా ప్రత్యేక నిధులు విడుదల చేయడంలో కేంద్రం మొండి చెయ్యి చూపినా కూడా పురపాలికలతో పాటు- అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిన విషయాన్ని నివేదించినందున ఫలితం ఉండవచ్చునని అధికారులు అంటున్నారు. దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు, విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలోని పట్టణాలన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆదారాలతో సహా కేంద్ర ఆర్థికశాఖకు పంపించారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు, రివార్డుల ప్రకారం చూసినా బడ్జెట్‌లో ఎంతొ కొంత ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తున్నారు.

పట్టణీకరణ జనాభా 47శాతం
తాజా కేంద్ర ప్రభుత్వ అవార్డులతో ఇప్పటి-కై-నా తమ ప్రభుత్వ పనితీరును మోడీ సర్కార్‌ గుర్తించిందన్న ఆశాభావంతో మరిన్ని నిధులు కేటాయిస్తారన్న నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కని పిస్తోంది. 47శాతం రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాల్లో వాటిని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టు-బడి ఉన్నది. ఇందుకోసమే నూతన మున్సిపాల్‌ చట్టం, నూతన భవన నిర్మాణ అనుమతుల చట్టం, ప్రతీ పట్టణం కచ్చితంగా ఖర్చు చేయాల్సిన 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌, టిఎస్‌ బి-పాస్‌ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. భవిష్యత్‌ అంచనాలు, అవస రాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న 68 పురపాలికలను 142 కు పెంచుకున్న విషయాన్ని రాష్ట్రం కేంద్రానికి నివేదించింది.

- Advertisement -

ఇదిగో మా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక
హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు ప్రజలకు అత్యంత అను వుగా మారిన నేపథ్యంలో దానికి అనుసంధానంగా భవిష్యత్తు ప్రయో జనాలను దృష్టిలో పెట్టు-కొని ఎయిర్‌ పోర్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ మెట్రో ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. రూ.6,250 కోట్ల బడ్జెట్‌తో 31 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి కేంద్రం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌ నగరంలో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం కోసం దాదా పు రూ.3050 కోట్లు- ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో 15శాతం మూలధన పెట్టు-బడిగా 450 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన వయబిలిటీ- గ్యాప్‌ ఫండింగ్‌లోని రూ.254 కోట్ల రూపాయల బకాయిలు ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నా యి. హైదరాబాద్‌ తో సహా తెలంగాణలోని పురపాలికల్లో చేపట్టిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌, బయోమైనింగ్‌ వంటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.3,777 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కనీసం 20 శాతం అంటే రూ.750 కోట్లు కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది.

విశ్వనగరానికి ఇవిగో ప్రణాళికలు
హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా చేపట్టబోతున్న అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. మూసి రివర్‌ ఫ్రంట్‌ డెవల ప్మెంట్‌, ఈస్ట్‌ వెస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ వే (రూ.11500 కోట్లు-), ఎస్‌ఆర్డీపీ రెండవ దశ (రూ.14000కోట్లు), డెవలప్మెంట్‌ ఆఫ్‌ ఎలివే-టె-డ్‌ కారిడార్ల నిర్మాణం – స్కై వేల నిర్మాణం (రూ.9,000 కోట్లు-) కోసం అవస రమయ్యే రూ.34,500 కోట్లలో కనీసం పది శాతం అంటే రూ.3,450 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది. హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ తగ్గింది. రూ.2400 కోట్లతో చేపట్టే 104 లింక్‌ రోడ్ల నిర్మాణ వ్యయంలో మూడో వంతు (రూ.800 కోట్లు) కేంద్ర ప్రభుత్వం భరించాలి. జాతీయ రహదారి 65 పైన ట్రాఫిక్‌ రద్దీని తగ్గిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీ-టె-యిల్స్డ్‌ ప్లానింగ్‌ రిపోర్ట్‌ సిద్ధంగా ఉంది. ఇందుకయ్యే 500 కోట్ల రూపాయల వ్యయాన్ని వచ్చే కేంద్రం ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలో చించి దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ సానిటేషన్‌ హబ్‌ను ఏర్పాటు- చేస్తుంది. ఇందుకు 100 కోట్ల సీడ్‌ ఫండింగ్‌ ఇవ్వాలి. ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ పదేపదే నివేదికల రూపంలో కేంద్రానికి పంపించింది. దీంతో కేంద్రం బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికుండే ప్రాధాన్యతలపై ఆశలు పెట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement