Saturday, December 7, 2024

FLASH: ఎల్లారెడ్డి రోడ్డు ప్రమాదం.. 9కి చేరిన మృతుల సంఖ్య..

కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎల్లారెడ్డి పోలీసు స్టేషన్‌ పరిధిలోని హసన్‌పల్లి గేటు వద్ద ఆదివారం సాయంత్రం 25 మంది ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్‌ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మరణించగా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరో ముగ్గురు మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. ఇక మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 14 మందికి కూడా గాయాల్వడంతో వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో డ్రైవర్‌ సాయిలు (25), లచ్చవ్వ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement