Sunday, June 4, 2023

9 ఫుల్ బాటిల్ లూటీ చేసిన వైన్స్ రైడర్ లు.. లబోదిబోమంటున్న బాధితుడు

పండుగపూట మందు తాగి ఎంజాయ్​ చేద్దామనుకుంటే.. నోటికాడి పెగ్గు లాగేసుకున్నారు. ఇంట్లో ఫంక్షన్​ కోసం దోస్తులకు, సుట్టాలకు దావత్​ ఇద్దామనుకుంటే.. బాటిల్స్​ మొత్తం లాగేసుకుని ఉత్త చేతులతో పంపించారు. ఇప్పుడేం చేయాలే.. వాళ్ల దగ్గర ఇజ్జత్​ ఎట్ల కాపాడుకోవాలే అని ఓ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నడు..

- Advertisement -
   

మొగుళ్లపల్లి, (ప్రభ న్యూస్): తొమ్మిది ఫుల్ బాటిల్ లు లూటీ చేసి దిక్కున్న చోట చెప్పుకో అంటూ దౌర్జన్యానికి దిగిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి మండలంలో ని మొట్లపల్లి శివారులో శనివారం జరిగింది. మొట్లపల్లి గ్రామానికి చెందిన మిరుపురి రవి కథనం ప్రకారం.. తన ఇంట్లో మాషికం (ద‌శ‌దిన‌క‌ర్మ‌) ఉందని చుట్టాలకు విందు ఏర్పాటు కోసం మద్యం తెచ్చేందుకు ఇల్లంతకుంట మండలంలోని మద్యం దుకాణం వద్ద 9 ఫుల్ బాటిల్ లు కొనుగోలు చేసి ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని నలుగురు దుండగులు అటకాయించి 9 ఫుల్ బాటిల్ లను దౌర్జన్యంగా లాక్కొని బెదిరించి మరీ పంపించారు.

నేను బెల్ట్ బెల్టు షాపు అమ్మే వ్యక్తిని కాదని, సాధారణ రైతునని.. ఇంట్లో విందుకోసం తీసుకు వెళుతున్నాం అని బతిమిలాడినా వినకుండా తీసుకెళ్లారు అని భాడితుడు విలపిస్తూ తెలిపారు. గతంలో కూడా ఒక ఒంటరి మహిళ ఇంట్లో దౌర్జన్యంగా చొరబడి ఇంట్లో ఉన్న బట్టలు చిందరవందర చేసి ఆమె వద్ద ఉన్న బాటిల్స్ ను కూడా లాక్కెళ్లారు, మొగుళ్లపల్లి బ్రాందీ షాప్ కు చెందిన కొందరు గూండాలు ముఠాగా చేరి సామాన్య రైతులను దారి దోపిడీ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నార‌ని, వీరిని గుర్తించి స్థానిక పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement