Friday, February 3, 2023

మార‌థాన్ లో 80ఏళ్ల బామ్మ‌.. యువ‌త‌కి ఆద‌ర్శం అంటోన్న నెటిజన్స్

80ఏళ్ల వ‌య‌సులో ఏం చేయ‌గ‌లం అనేవారికి ఈ బామ్మ ఓ ఉదాహ‌ర‌ణ‌..ఈ వ‌య‌సులో ఈ బామ్మ ఏకంగా పరుగు పందెంలో హుషారుగా పాల్గొనడం విశేషం. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ముంబై వాసులు ఈ పరుగులో పాల్గొనగా.. చీర కట్టుకుని, కాళ్లకు షూ ధరించిన ఓ బామ్మ కూడా వారితో కలసి పరుగు అందుకున్నారు. ఆమెను చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆమె పేరు భారతి. ఆమె మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. యువతరానికి బామ్మగారు మంచి స్ఫూర్తినీయం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమంలో 55 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. అందరిలోకీ భారతి అనే ఈ బామ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పరుగెత్తే సమయంలో చేతితో త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నారు. 4.2 కిలోమీటర్ల దూరాన్ని 51 నిమిషాల్లో చేరుకున్నారు. పెద్ద వయసు కావడంతో మధ్య మధ్యలో నడుస్తూ, పరుగెత్తుతూ గమ్యం చేరుకున్నారు. మారథాన్ లో బామ్మ పాల్గొనడం ఇది ఐదోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement