Monday, May 17, 2021

జూపార్కులో సింహాలకు కరోనా లక్షణాలు!

కరోనా వైరస్‌ వ్యాప్తి మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌ లోని జూపార్క్‌లో 8 సింహాలకు కరోనా లక్షణాలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అధికారులు సింహాల నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. ఇవాళ నివేదికలు వచ్చే అవకాశముంది. కరోనా నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో ఈ నెల 2 నుంచి జూపార్క్‌ ను అధికారులు మూసివేశారు.

సీసీఎంబీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నివేదికలో ఏం వస్తుందోనని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. సెకండ్ వేవ్‌ లో జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులను మూసివేశారు. ఈ క్రమంలోనే ఆదివారం(మే 2) నుంచి జూ పార్కులో సందర్శకులకు జూ అధికారులు అనుమతి నిరాకరించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News