Thursday, April 25, 2024

గోదావరిలో చిక్కుకున్న స్వామీజీలు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలంలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. స్థానికంగా ఉన్న సావెల్ ఆశ్ర‌మంలోకి నీళ్లు చేరాయి. దీంతో ఆశ్రమంలో ఉన్న ఏడుగురు స్వామీజీలు చిక్కుకున్నారు. స్వామీజీలు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే, విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆశ్ర‌మానికి పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి ఏడుగురు స్వామీజీల‌ను సుర‌క్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాయి.

మరోవైపు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 2.3 లక్షల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తిన అధికారులు.. 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1089.80 అడుగుల వద్ద ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలు. ప్రస్తుతం 83.772 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇది కూడా చదవండి: ఇదేం విచిత్రం.. ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉంది!

Advertisement

తాజా వార్తలు

Advertisement