Thursday, March 28, 2024

ఉక్రెయిన్ పై దాడికి 64కిలోమీటర్ల రష్యా సైనికుల కాన్వాయ్

ఉక్రెయిన్ పై రష్యా దాడి తీవ్రతరం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఉత్తర దిక్కు నుంచి రష్యా సైన్య వాహన శ్రేణి పెద్ద ఎత్తున ముందుకు కదులుతోంది. 64 కిలోమీటర్ల మేర వున్న రష్యా సైనికుల కాన్వాయ్ ముందుకు సాగుతున్నట్లు అమెరికా టెక్నాలజీ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ తీసిన శాటిలైట్ చిత్రాలు తెలియజేస్తున్నాయి. గతంలో తీసిన చిత్రాలను పరిశీలిస్తే అప్పుడు 27 కిలోమీటర్ల మేరే రష్యా సైన్యం కనిపించగా, తాజాగా అది రెట్టింపు కావడం వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఆయుధాలతో కూడిన వాహనాలు, యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, కావాల్సిన సామాగ్రితో కూడిన వాహనాలు రష్యా సైనిక కాన్వాయ్ లో కదులుతున్నాయి. దక్షిణ బెలారస్ లో క్షేత్రస్థాయిలో సైనికుల మోహరింపు, హెలికాప్టర్ యూనిట్లు కూడా శాటిలైట్ ఫొటోల్లో కనిపించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలోని ఆంటనోవ్ ఎయిర్ పోర్ట్ దిశగా రష్యా సైనిక కాన్వాయ్ ప్రయాణం చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement