Monday, May 29, 2023

Covid-19: దేశంలో కొత్తగా 50 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ తగ్గుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 50407 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,86,544 కు చేరింది. కరోనాతో 804 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,07,981 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,36,962 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,14,68,120 కు పెరిగింది. దేశంలో 6,10,443 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా.. కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,72,29,47,688 కరోనా వ్యాక్సిన్లు అందించనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement