Friday, April 19, 2024

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కొవిడ్ మందులపై పన్నులు త‌గ్గించే చాన్స్!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం శనివారం ప్రారభమైంది. వర్చువల్‌ విధానంలో సమావేశం జరుగుతోంది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, ఇతర పరికరాలు, బ్లాక్‌ ఫంగస్‌, అత్యవసర మందుల పన్ను రేట్ల తగ్గింపుపై జీఎస్‌టీ మండలి చర్చించిస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర‌ ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో పాటు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ప‌లువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. కోవిడ్‌ 19 చికిత్సకు అవసరమైన ఆక్సీజన్, ఆక్సీమీటర్లు, హాండ్‌ శానిటైర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతరాలపై జీఎస్‌టీ రాయితీలిచ్చే అంశంపై చర్చించిస్తున్నారు. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు.

గత నెల 28న జరిగిన మండలి సమావేశంలో పన్ను మినహాయింపులపై చర్చ జరిగింది. అయితే, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంటిలేటర్లు, పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్‌, మాస్కులు, టీకాలపై పన్ను మినహాయింపు విషయమై మంత్రుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఈ నివేదికతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను తగ్గింపు అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి ?.. ఉత్తమ్ కు తెలియదా?

Advertisement

తాజా వార్తలు

Advertisement