Wednesday, April 17, 2024

3rd Test : వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. స్కోరు 192/7

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా జ‌ట్టు 156 ప‌రుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా.. ఈరోజు ఆట ప్రారంభమైనప్పటి నుంచి మరో మూడు వికెట్లు కోల్పోయింది. హ్యాండ్స్ కాంట్ 19 పరుగులు చేసి ఔటవ్వగా.. ఆ తర్వాత గ్రీన్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం స్టార్క్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 192 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement