Saturday, April 20, 2024

యాదాద్రి ఆలయానికి 36 కిలోల బంగారం

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు కూడా బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 36.16 కిలోల బంగారాన్ని దాతలు విరాళంగా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునఃనిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల నిధులతో యాదాద్రి ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి ఆలయంలో అడుగడుగునా అబ్బురపరిచే కళానైపుణ్యం దర్శనమిస్తున్నాయి.

ఇటీవల యాదాద్రి పర్యటన సందర్భంగా ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2022 మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసినట్లు వెల్లడించారు. 8 రోజుల ముందు నుంచి మహా సుదర్శన యాగం జరుగుతుందని తెలిపారు. అలాగే చిన జీయర్‌ స్వామి పర్యవేక్షణలో మహా సుదర్శన యాగం ఉంటుందన్నారు. యాదాద్రిలో 10వేల మంది రుత్వికులతో సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు.

యాదాద్రి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించారు. ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని చెప్పారు.  స్వర్ణతాపడానికి సుమారు దాదాపు 125 కిలోల బంగారం అవసరం అవుతుంది. అందుకు సుమారు రూ. 60 కోట్లు ఖర్చవుతుంది. ఈ క్రమంలోనే దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. తమ కుటుంబం నుంచి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం స్వామి వారికి అందిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో రాజకీయ వేడి.. ప్రచార బరిలో రేవంత్..

Advertisement

తాజా వార్తలు

Advertisement