Friday, April 19, 2024

ప్లీన‌రీ వేళ జంబో ఎఐసిసి…తెలంగాణ నుంచి 33 మందికి చోటు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ అధిష్టానం తెలం గాణకు చెందిన 33 మందిని ఏఐసీసీ సభ్యులుగా నియమించింది. మరో 10 మందికి కో అప్షన్‌ సభ్యు లుగా అవకాశం కల్పించింది. ఛత్తీష్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయపూర్‌లో ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ఏఐసీసీ ప్లీనరీ జరగనుంది. అందుకు మూడు రోజుల ముందు గానే ఏఐసీసీ సభ్యులను జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఏఐసీసీ సభ్యులుగా నియమించిన వారిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు వి. హనుమంతరావు, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, రేణుకాచౌదరి, మధుయాష్కీ గౌడ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, కొండా సురేఖ, మల్లు రవి, గీతారెడ్డి, కోదండరెడ్డి, అజారుద్దీన్‌, మహేష్‌కుమార్‌ గౌడ్‌, శివసేనా రెడ్డి, బల్మూరి వెంకట్‌లకు అవకాశం కల్పించారు. ఇక ఏఐసీసీ కో ఆప్షన్‌ సభ్యులుగా ఆర్‌.దామోదర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి, వంశీచంద్‌ రెడ్డి, సురేష్‌కుమార్‌ షెట్కార్‌, రమేష్‌ ముదిరాజ్‌, హెచ్‌.వేణుగోపాల్‌, జెట్టి కుసుమకుమార్‌, జి.నిరంజన్‌, టి. కుమార్‌రావు, బెల్లయ్య నాయక్‌, అనులేఖ, సునీతారావు, కోట నీలిమకు నియమించారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శలకు అసెంబ్లి నియోజక వర్గాలుగా బాధ్యతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
ఈ మేరకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 64 మంది ప్రధాన కార్యదర్శులకు ఒక్కొక్కరికి రెండు అసెంబ్లి నియోజక వర్గాల చొప్పున ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పజెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement