32మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్ లాల్ హత్యకేసు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేశారు. పోలీసులపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన టైలర్ కన్హయ్యను.. ఇద్దరు వ్యక్తులు చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహమ్మద్‌లను అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించారు. పాక్‌లోని దావత్ ఏ ఇస్లామీ గ్రూపుతో హంతకులకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉదయ్‌పూర్ ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్న రాజస్థాన్ పోలీస్ చీఫ్ ఎంఎల్ లాథర్ తెలిపారు. ఇద్దరు నిందితులను గురువారం కోర్టుముందు హాజరుపరిచారు. ఆ ఇద్దర్నీ 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.
టైలర్ హత్య ఘటనలో-32మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ పర్స్

- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement