Saturday, December 7, 2024

Crime: మంత్రాల నెపంతో ముగ్గురి హత్య

మంత్రాల నెపంతో ముగ్గురు హత్యకు గురైన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గురువారం జగిత్యాల రూరల్ మండలం తారక రామ నగర్ లో మంత్రాలు చేస్తున్నారని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయగా జగన్నాథం నాగేశ్వరరావు, జగన్నాథం రాంబాబు, రమేష్ లు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న జగిత్యాల డిఎస్పి ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement