Friday, April 26, 2024

HYD: మాదాపూర్ లో కారు బీభత్సం.. ఇంట్లోకి దూసుకెళ్లి..

హైదరాబాద్ లోని మాదాపూర్ లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు ఇంట్లోకి దూసుకుపోయింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు అతివేగంతో బైక్ ను ఢీకొట్టాడు. అనంతరం కారు అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసు తెలిపారు. నిందితుడు హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement