Friday, March 29, 2024

2nd Test : లంచ్ బ్రేక్.. బంగ్లాదేశ్ స్కోరు 82/2

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు శాంటో 24 పరుగులు, జకీర్ హసన్ లు 15 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు షకీబల్ హసన్ 16 పరుగులు, మోమినుల్ హక్ 23 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తుది టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగింది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా మరో భారీ విజయంపై కన్నేసింది. మిర్పూర్‌లోని షేర్‌ ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement