Friday, December 6, 2024

Medicines | 23 రకాల మందుల రేట్లు ఫిక్స్‌.. డయాబెటిక్​, బీపీ మందుల ధరలివే..

దేశంలో 23 రకాల మందుల రేట్లను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిర్ణయించింది. ఇందులో డయాబెటిక్‌, రక్తపోటుకు వినియోగించే మందులు కూడా ఉన్నాయని నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) శుక్రవారం తెలిపింది. నోటిఫికేషన్‌ ప్రకారం మధుమేహానికి వాడే మందు గ్లిక్లాజైడ్‌ ఈఆర్‌, మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ టాబ్లెట్‌ ఒక దాని ధరను 10.03 రూపాయలుగా నిర్ణయించింది.

వీటితో పాటు టెల్మిసార్టన్‌, క్లోర్తాలిడోన్‌ అండ్‌ సిల్నిడిపైన్‌ టాబ్లెట్స్‌ రిటైల్‌ ధరను 13.17 రూపాయలుగా నిర్ణయించింది. నొప్పి నివారణ మందులైన ట్రిప్సిన్‌ ట్రోమెలైన్‌ రూటోసైడ్‌ టైమెలైన్‌, రూటోసైడ్‌ ట్రైహైడ్రేట్‌, డైక్లోఫెనాక్‌ సోడియం టాబ్లెట్‌ల రిటైల్‌ ధరను 20.51 రూపాయలుగా ఫిక్స్‌ చేసింది. వీటితో పాటు 15 షెడ్యూల్డ్‌ ఫార్మలేషన్స్‌ సీలింగ్‌ ధరను కూడా సవరించినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement