Wednesday, May 25, 2022

TS: సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న ప్ర‌శాంత్ కిశోర్

తెలంగాణ కేసీఆర్ తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి భేటీ కానున్నారు. ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ సమావేశం కానున్నట్లు సమాచారం. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న‌ రాజకీయ సమీకరణాలపై కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇవ్వనున్నట్లు  తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ కు వివ‌రాలు తెల‌పనున్న‌ట్లు స‌మాచారం. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈసారి కేసీఆర్ అనూహ్యంగా పీకేను టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్తగా నియమించారు. దీంతో ఇప్పటికే ప‌లుసార్లు కేసీఆర్‌తో పీకే స‌మావేశ‌మై రాజ‌కీయ చర్చలు జరిపిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement