పడవ మునిగి 145 మంది జలసమాధి అయిన విషాద ఘటన వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగింది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా 55 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపడినట్టు వెల్లడించారు. వీరంతా తమ వస్తువులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్‌కుసు పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది. గత అక్టోబర్‌లో ఈక్వెటూర్ ప్రావిన్స్‌లోని కాంగో నదిలో ఇలాగే 40 మందికి పైగా మృతి చెందారు. డీఆర్‌సీలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు.
Breaking: పడవ మునిగి 145 మంది జలసమాధి..

- Advertisement -
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement