Friday, April 26, 2024

Breaking: బీఎస్‌ఎఫ్‌లో 1410 కానిస్టేబుల్‌ పోస్టులు

బీఎస్ఎఫ్ లో భారీగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. సరిహద్దు భద్రతా దళం బీఎస్‌ఎఫ్‌ (BSF) కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మ్యాన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 1410 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో 1343 పోస్టులు పురుషులకు, 67 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఆసక్తికలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోచ్చు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టుల వివ‌రాలు : 1410 ఉన్నాయి. ఇందులో కోబ్లర్‌ 23, టైలర్‌ 13, ప్లంబర్‌ 23, పెయింటర్‌ 17, ఎలక్ట్రిషన్‌ 12, పంప్‌ ఆపరేటర్‌ 1, డ్రాట్స్‌మ్యాన్‌ 8, అప్‌హోల్‌స్టర్‌ 1, టిన్‌ స్మిత్‌ 1, బట్చర్‌ 1, కుక్‌ 480, వాటర్‌ క్యారియర్‌ 294, వాషర్‌ మ్యాన్‌ 132, బార్బర్‌ 58, స్వీపర్‌ 277, వెయిటర్‌ 5, మాలి 26, ఖోజి 36 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పీఎస్టీ, పీఈటీ, ట్రేడ్‌ టెస్ట్‌, రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజునుంచి మినహాఇంపు ఇచ్చారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌ అప్లికేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement