Thursday, April 25, 2024

క్రికెట్ లోకి అడుగుపెట్టి 14ఏళ్లు-త‌న అనుభ‌వాల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన కోహ్లీ

అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టి 14సంవ‌త్స‌రాలు అయింది. 2011 ఆగ‌స్టు 18వ తేదీన డంబుల్లాలో శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డేలో అత‌ను అరంగేట్రం చేశాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో అత‌ను 22 బంతుల్లో 12 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. కానీ 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కోహ్లీ ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియ‌న్ క్రికెట్‌లోనూ అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా అవ‌త‌రించాడు. 14 ఏళ్ల అనుభ‌వాల్ని కోహ్లీ త‌న ఇన్‌స్టాలో పంచుకున్నాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని ఫోటోల‌తో వీడియోను పోస్టు చేశాడు. 14 ఏళ్ల క్రితం కెరీర్ మొద‌లైంద‌ని, దీన్ని గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు కోహ్లీ త‌న వీడియో క్యాప్ష‌న్ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement