Tuesday, April 23, 2024

12మంది ఎంపీలు స‌స్పెండ్ .. ఎందుకో తెలుసా ..

గ‌త సెష‌న్ లో నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో 12మంది ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను రాజ్య‌స‌భ స‌స్పెండ్ చేసింది. ఈ శీతాకాల స‌మావేశాలు మొత్తం వారిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. అస‌లేం జ‌రిగిందంటే .. రాజ్యసభ 254వ సెషన్ చివరి రోజు అంటే ఆగస్టు 11న భద్రతా సిబ్బందిపై ప్రవర్తన, ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారు. ఈ సభ, సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభ నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన ద్వారా సభ కార్యకలపాలను ఉద్దేశపూర్వకంగా నిరోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తుంద‌ని అధికారిక నోటీసుల్లో వివ‌రించారు. ఏ ఏయే పార్టీల‌కి చెందిన ఎంపీలు స‌స్పెండ్ అయ్యారో చూద్దాం..

  1. ఎలమరం కరీం (సీపీఎం)
  2. ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్)
  3. ఛాయా వర్మ (కాంగ్రెస్)
  4. రిపున్ బోరా (కాంగ్రెస్)
  5. బినోయ్ విశ్వం (సీపీఐ)
  6. రాజమణి పటేల్ (కాంగ్రెస్)
  7. డోలా సేన్ (టీఎంసీ)
  8. శాంత ఛెత్రి (టీఎంసీ)
  9. సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్)
  10. ప్రియాంక చతుర్వేది (శివసేన)
  11. అనిల్ దేశాయ్ (శివసేన)
  12. అఖిలేష్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్) స‌స్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement