Thursday, April 25, 2024

ఉలిక్కిపడ్డ మీడియా.. 36 రోజుల్లో.. 114 మంది జర్నలిస్టులు మృతి!

దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. పలవురు జర్నలిస్టులని బలి తీసుకుంది. దేశవ్యాప్తంగా గడిచిన 36 రోజుల్లో 114 మంది జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారు.  కరోనా మహామ్మారిని ఎదుర్కోనేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కొనసాగుతున్న జర్నలిస్టుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  మే 1-6వ తేదీ మధ్య 24 మంది,  ఏప్రిల్ 1 నుంచి 30 మంది 90 మంది జర్నలిస్టులు మృత్యవాత పడ్డారు. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లోల ఈ మరణాలు నమోదు అయ్యాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం జర్నలిస్టులను  ఫ్రంట్‌ లైన్ వారియర్స్‌ గా గుర్తించడం లేదు.

ఇదీ చదవండి: కరోనా మృత్యుఘంటికలు.. వరుసగా మూడో రోజూ 4 లక్షలకు పైగా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement