Thursday, March 28, 2024

War: 11 వైమానిక, 70కి పైగా సైనిక స్థావ‌రాలు ధ్వంసం చేశాం.. ర‌ష్యా వెల్ల‌డి

ఉక్రెయిన్‌లోని 11 వైమానిక స్థావ‌రాల‌తోపాటు 70కి పైగా సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేశామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది. ర‌ష్యా సైనిక బ‌ల‌గాల ఆధ్వ‌ర్యంలో దాడులు జ‌రిపామ‌ని, 74 ఉక్రెయిన్ మిలిట‌రీ గ్రౌండ్ ఫెసిలిటీస్ ధ్వంసం అయ్యాయి అని ర‌ష్యా ర‌క్ష‌ణ‌శాఖ అధికార ప్ర‌తినిధి ఇగోర్ కొనాషెన్‌కోవ్ చెప్పారు. 11 వైమానిక స్థావ‌రాలు, మూడు క‌మాండ్ పోస్ట్‌లు, 18 రాడార్ స్టేష‌న్లు ధ్వంసం చేశామ‌న్నారు. ఎస్‌-300, బ‌క్‌-ఎం1, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ క్షిప‌ణుల వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా దెబ్బ తిశామ్నారు. ఒక ఉక్రెయిన్ హెలికాప్ట‌ర్‌తోపాటు 4 డ్రోన్ల‌ను కూల్చేశామ‌ని ఇగోర్ కొన‌సాషెన్‌కోవ్ తెలిపారు. ర‌ష్యా సాయుధ బ‌ల‌గాల వైమానిక మ‌ద్ద‌తుతో ప్రత్యేక సాయుధ బ‌ల‌గాలు దాడి కొన‌సాగిస్తున్నాయ‌న్నారు. జాతీయ వాదుల‌తో కూడిన ఆర్మ్‌డ్ గ్రూప్‌లు ప్ర‌తిఘ‌టిస్తున్నాయ‌న్నారు. ఉక్రెయిన్ సైనిక బ‌ల‌గాలు ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లాల‌ని భావిస్తున్నాయ‌ని చెప్పారు.

అయితే, ఉక్రెయిన్ సైనికుల‌ను గౌర‌వించాల‌ని ర‌ష్యా సైనిక బ‌ల‌గాల‌కు త‌మ ర‌క్ష‌ణ మంత్రి సెర్జెయి షౌగు ఆదేశాలు జారీ చేశార‌ని కొన‌సాషెన్‌కోవ్ వెల్ల‌డించారు. గురువారం ఉద‌యం 5.40 గంట‌ల‌కు జాతినుద్దేశించి అధ్య‌క్షుడు పుతిన్ మాట్లాడిన త‌ర్వాత ఉక్రెయిన్‌పై సైనిక దాడిని ర‌ష్యా ప్రారంభించింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌తోపాటు ప‌లు ఇత‌ర న‌గ‌రాల‌పైనా బాంబుల దాడి కురిపించాయి ర‌ష్యా బ‌ల‌గాలు. ఈ దాడుల్లో ఇరువైపులా సైనికులు, పౌరుల‌తో క‌లిసి 68 మంది మ‌ర‌ణించారు. ఉక్రెయిన్ బ్లాక్ సీ పోర్ట్ సొటీ ఒడెస్సా స‌మీపాన గ‌ల మిల‌ట‌రీ బేస్ వ‌ద్ద 18 మంది మృతి చెందారు. ర‌ష్యా పూర్తి స్థాయిలో త‌మ‌పై దండ‌యాత్ర కొన‌సాగిస్తున్న‌దని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమ్యిట్రో కులేబా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement