Friday, April 19, 2024

హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉరుములతో కుండపోత వర్షం

హైదరాబాద్‌ నగరంలో శనివారం పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్‌, రాంనగర్‌, సికింద్రాబాద్‌, ముషిరాబాద్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, చంపాపేట, సైదాబాద్‌ పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసర పనులు తప్ప ఎవ్వరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు 040-21111111కు సంప్రదించాలని తెలిపారు.

ఇది కూడా చదవండి: Huzurabad by-election: ఈటలకు షాక్..బరిలో నలుగురు రాజేందర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement