Thursday, April 25, 2024

సాగ‌ర్ ఉపఎన్నిక: 4వ రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ దూసుకుపోతున్నారు. వ‌రుస‌గా తొలి నాలుగు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. నాలుగో రౌండ్ ముగిసే స‌రికి 3,457 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి.

నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబు‌ళ్లపై లెక్కింపు ఏర్పాటు చేశారు. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండ‌డంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి‌కా‌నుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధి‌కా‌రి‌కంగా విజే‌తను ప్రక‌టించే అవ‌కాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా కొవిడ్‌ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో సహా పోలింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్‌లో భాగంగా మొదట పోస్టల్‌ బ్యాలెట్లను సిబ్బంది లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్‌లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement