Saturday, April 20, 2024

ఉక్కు సంకల్పానికి ప్రభుత్వం కూడా మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు శుక్రవారం ఏపీ వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నాయి. ఈ బంద్‌కు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్దతు ఇవ్వగా.. తాము కూడా సంఘీభావం తెలుపుతున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర బంద్‌కు మద్దతుగా రేపు మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అవుతాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత బస్సులు రోడ్డెక్కుతాయని.. సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని మంత్రి నాని వివరించారు. కొన్ని సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటేనే ధరలు అదుపులో ఉంటాయని నాని వ్యాఖ్యానించారు. అందుకే ఆర్టీసీని ప్రజల ఆస్తిగా ఉంచామన్నారు. ఏపీని గత ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపి అప్పులపాలు చేశాయని, పన్ను పీకించుకోవడానికి కూడా గత ప్రభుత్వాలు రేట్లు పెంచాయని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement