Saturday, April 20, 2024

రాధేశ్యామ్ సెకండ్ సింగిల్ సాంగ్ హిందీలో ..

ఈ మ‌ధ్య‌కాలంలో పాన్ ఇండియా మూవీస్ గా ప‌లు చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. వాటిల్లో రాధేశ్యామ్ కూడా ఒక‌టి. ఈ చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ .. పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్నారు. రాధాకృష్ణ ఈ చిత్రానికి డైరెక్ట‌ర్.. యూవీ క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ లో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. హిందీ వర్షెన్‌ లో సాగే… ఈ సాంగ్‌ ఆషికి ఆ గయీ అనే లిరిక్స్‌ తో ప్రారంభం అవుతుంది. ఇక ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు. లవ్‌, ఎమోషనల్‌ ఫీలింగ్‌ ఇద్దరూ అలరించారు. ముఖ్యంగా… ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా మధ్య రొమాంటిక్‌ యాంగిల్ బాగా వర్కౌట్‌ అయింది. మూడు నిమిషాల 12 సెకండ్లు సాగే ఈ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. నేటి సాయంత్రం ఈ సాంగ్‌ తెలుగు వర్షన్ కూడా రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement